హైదరాబాద్లో 3BHKకు పెరిగిన క్రేజ్.. ఫిక్కీ-అనరాక్‌ సర్వేలో వెల్లడి

-

ఒకప్పుడు సింగిల్ బెడ్రూంతో సరిపెట్టుకునే జనం ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్నారు. పెద్ద ఎత్తున 2 బీహెచ్కేకు డిమాండ్ పెరగడంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ధర అధికమైనా సరే 3 పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లపైనే కొనుగోలుదారులు మక్కువ చూపిస్తున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ సర్వే ప్రకారం ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్‌కే (3 పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారట. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి మహానగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించగా.. ఏడాది క్రితం 3బీహెచ్‌కే ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version