పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత BRS ప్రభుత్వ హయంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కారు గుర్తు పై విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలోకి పోచారం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలోనే పోచారం పదవి కోసమే పార్టీ మారారు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి.
కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు అని.. ఆయన అనుభవం మేము వాడుకుంటాం అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు అందుకు తగ్గిన విధంగానే ఆయనకు కేబినెట్ పదవీ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారుగా నియమిస్తూ జీవో విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.