హెచ్‌సీఎల్ లో మరో 15 వేల ఉద్యోగాల కల్పన..!

-

ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తుంది. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేషుతో భేటీ అయ్యారు హెచ్‌సీఎల్ ప్రతినిధులు. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేషుకు వివరించారు హెచ్‌సీఎల్ ప్రతినిధులు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు హెచ్‌సీఎల్ ప్రతనిధులు. అయితే గత ప్రభుత్వం నిలిపేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా లోకేషు ను కోరారు హెచ్‌సీఎల్ ప్రతినిధులు. అయితే 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. హెచ్సీఎల్ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం అని లోకేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version