సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను అందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఏడాది లో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాదన్నారు.
దేశంలో ఎవరు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. గ్రూప్ 1 … 14 యేండ్ల తర్వాత మేమే ఉద్యోగాలు నియామకాలు చేశామని… ఉమ్మడి రాష్ట్రంలో కూడా వేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేయలేదని ఆగ్రహించారు. చిక్కుముడులు విప్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నామని… యువత ఆలోచించాలని కోరారు. మా ప్రయత్నాన్ని గమనించండని విన్నవించారు. జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించారు. అలాగే…. సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా కోటి రూపాయల నుంచి కోటి 25 లక్షలు పెంచనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం చేసుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.