సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో అల్లుఅర్జున్ మీద బాధితురాలి భర్త కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయగా.. ఆ తర్వాత ఒక రోజు జైలుకు సైతం పంపించారు.
ముందు మధ్యంతర బెయిల్ పొందిన బన్నీ.. తాజాగా రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నారు. అయితే, రెగ్యులర్‌గా అల్లుఅర్జున్ చిక్కడ పల్లి పోలీస్‌స్టేషన్లో విజిట్ అవ్వాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం బన్నీ చిక్కడ పల్లి పీఎస్‌కు వెళ్లి సంతకం పెట్టి పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రస్తుతం బన్నీ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిక్కడపల్లి పీఎస్ నుండి జూబ్లీహిల్స్ నివాసానికి బయల్దేరిన అల్లు అర్జున్
కోర్టు ఆదేశాల మేరకు చిక్కడపల్లి పీఎపీఎస్లో సంతకం చేసిన అల్లు అర్జున్ https://t.co/vYzUeFio0L pic.twitter.com/hkUN7qr1RP
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025