తెలంగాణలో మరో 2,043 ఆలయాలకు ధూపదీప నైవేద్యం

-

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 3,645 ఆలయాలను ధూపదీప నైవేద్య పథకం కిందకు తీసుకురాగా… తాజాగా గ్రామాల్లో 2,043 ఆలయాలకు ఈ పథకం వర్తింపజేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రస్తుతం ధూపదీప నైవేద్యం కింద ఆలయాలకు రూ.6000 ఇస్తున్నారు. వీటిలో రూ. 4000 అర్చకుడికి వేతనంగా… మిగిలిన రూ.2వేలు ఆలయంలో ధూపదీప నైవేద్యానికి ఖర్చు చేస్తారు. దీన్ని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ శనివారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల సంకీర్తనలు, కోలాటాలు అలరించాయి. అయితే ఇకనుంచి ప్రతి శనివారం ‘నగర సంకీర్తనలతో గిరిప్రదక్షిణ’ నిర్వహిస్తామని ఆలయ ఈవో గీత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version