జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో అక్టోబర్ 2 నుంచి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు జరపాలని తెలిపారు.
క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డి, ఖోఖో వంటి క్రీడలతో పాటు సాంప్రదాయ ఆటలు నిర్వహించాలని సూచించారు. కాగా, సోషల్ మీడియాలో వైసిపి, టిడిపి మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ‘ధర్మం కోసం అన్నవెంట నడిస్తే అది ఆది పురుష్ కథ. బాబాయ్ ని లేపేసి తమ్ముడిని కాపాడితే అది అవినీతి పురుష్ కథ’ అని టిడిపి చేసిన ట్వీట్ కు వైసిపి కౌంటర్ ఇచ్చింది. ‘లోక కళ్యాణం కోసం కృష్ణుడు మేనమామను చంపడం మహాభారతం అయ్యింది. అదే బాబు పదవి కోసం పిల్లనిచ్చిన మామను పొడవడం వెన్నుపోటు బాగోతం అయింది’ అని వైసిపి రిప్లై ఇచ్చింది.