కొడాలి నాని కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి మరీ పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు.. గతంలో టిడిపి నాయకులను ట్రోలింగ్ చేసిన వారిపై.. ఇప్పుడు టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. ఈ తరుణంలోనే శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇలాంటి కీలక వ్యక్తుల పైన కేసులు నమోదు అయ్యాయి.
ఇక తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పై కూడా కేసు బుక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అలాగే నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని… కొడాలి నాని పైన ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ మహిళ ఫిర్యాదును రికార్డ్ చేసుకున్న పోలీసులు ఫేస్బుక్ చేశారు. దీనిపై కొడాలి నాని కి నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని పై కేసులు పెట్టాలని కూడా ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.