GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు

-

Case registered against GHMC Mayor Gadwala Vijayalakshmi: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కు ఊహించని షాక్‌ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు కావడం జరిగింది. బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సమయం దాటాక కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ ప్లే చెయ్యడంపై మేయర్ విజయలక్ష్మిపై సుమోటోగా కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు.

Case registered against GHMC Mayor Gadwala Vijayalakshmi

మేయర్ విజయలక్ష్మితో పాటు ఈవెంట్ నిర్వాహకుడు, డీజే సౌండ్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు కావడం జరిగింది. ఇది ఇలా ఉండగా… సామాన్య ప్రజలకు ఒక రూల్.. మేయర్‌కు ఒక రూల్ అన్నట్లుగా జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వ్యవహరించారు. నగరంలో డీజేలను నిషేధించినా… బతుకమ్మ పండుగలో డీజేలతో హోరెత్తించారు. తల్వార్ పట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. పోలీసులు వచ్చినా ఎం చెయ్యలేరు నేనున్నా.. అంటూ రెచ్చగొట్టారట. ఈ తరుణంలోనే.. జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version