ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ఠ్. ఏపీలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వివరించింది.
విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయట. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్.