కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : మహేష్ కుమార్ గౌడ్

-

కులగణన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాందీ కులగణన పై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు. 

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన పై సాహసోపేత కార్యక్రమాలను తీసుకున్నారని చెప్పారు. పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నవంబర్ 02న 33 జిల్లాలలో కులగణన పై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ విభాగాల్లో కులగణన పై ఎలాంటి అనుమానాలు ఉన్నా గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version