బీఈడీ అభ్యర్థుల ఛలో ఇందిరా పార్క్ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు

-

నవంబర్ 3వ తేదీన బీఈడీ అభ్యర్థులు ఛలో ఇందిరా పార్క్ ధర్నాకు పిలుపునిచ్చారు. దాదాపు 5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ కోటా తొలగించి 100% పోస్టులు బీఈడీ వారితోనే భర్తీ చేయాలని, ఎస్జీటీ వారికి ఇస్తున్న 70% ప్రమోషన్ కోటా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు బీఈడీ అభ్యర్థులు.

అయితే నవంబర్ 3వ తేదీన బీఈడీ అభ్యర్థుల చలో ఇందిరా పార్క్ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపింది బీఆర్ఎస్ పార్టీ. బీఈడీ అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలో పాల్గొననున్నట్టు ప్రకటించారు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు నిరుద్యోగులకు, ఇటు ఉద్యోగులకు అందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. గ్రూపు-1 పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా అఘమేఘాల మీద పరీక్షను నిర్వహించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version