తెలంగాణలో భారీ మద్యం నిల్వలపై ఈసీ ఆరా.. నివేదిక పంపాలని లేఖ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించండానికి దిల్లీ నుంచి హైదరాబాద్ కు ఎన్నికల బృందం వచ్చింది. ఏర్పాట్లపై ఆరా తీస్తూ.. లోటుపాట్లపై అధికారులకు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్రంలో లిక్కర్ నిల్వలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ భారీగా మద్యం నిల్వ ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ నిల్వలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.

తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం నిల్వలు, విక్రయాలు ఉండటంపై ఈసీకి ఫిర్యాదులు రావడంతో చర్యలకు ఉపక్రమించింది. అసలు తెలంగాణలో మద్యం విక్రయాలు ఏ ప్రాతిపదికన సాగుతాయి.. చెల్లింపులు విధానమేంటి… పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో మద్యం సరఫరా చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచీ అమలు చేస్తోందా? ఇప్పుడే ఈ విషం గమనిస్తోందా.. ఇలా పలు అంశాలపై నివేదిక పంపాలని ఈసీ లేఖలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news