గద్వాల నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని ఈసీ ఆదేశం

-

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇస్తోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. రెండో స్థానంలో ఉన్న బీజేపీ నేతను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే తాజాగా.. గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ న్నికైనట్లుగా ప్రచురించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది.

హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్​లో ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీరు కాపీని ఈసీ జతపరిచింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. వెంటనే గెజిట్​ను పబ్లిష్ చేయాల్సిందిగా.. అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్​రాజ్​కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. గెజిట్ పబ్లిష్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news