హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించనుంది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వెళ్లనుంది. HCU పరిధిలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు, జరిగిన నష్టంపై అంచనా వేయనుంది.

ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ, పర్యావరణ వేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారున్నట్టు సమాచారం.
- ఇవాళ కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించనున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ
- ఉదయం 10 గంటలకు కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్ర స్థాయి పర్యటన, వాస్తవ పరిస్థితులపై అధ్యయనం
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సభ్యుల సమావేశం