నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీఈఓ వికాస్ రాజ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.13 నియోజకవర్గాల పరిధిలో నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీ్స్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు 65వేల మంది, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో లక్ష మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version