టీటీడీపీలో జోష్..బాబు స్కెచ్..గెలవరు? గెలవనివ్వరు?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో నేతలు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడుగా వచ్చారో అప్పటినుంచి..టీడీపీకి కాస్త ఊపు వచ్చింది. గత అధ్యక్షుల మాదిరిగా ఆయన సైలెంట్ గా ఉండిపోకుండా..పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఖమ్మంలో భారీ సభ పెట్టి చంద్రబాబుని తీసుకొచ్చి సక్సెస్ చేశారు.

ఇక ఈ మధ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు కృషి చేస్తున్నారు. నిదానంగా పార్టీ బలం పెంచే దిశగా వెళుతున్నారు. అయితే తెలంగాణలో పార్టీ నిదానంగా పుంజుకుంటుంది..అలా అని టి‌డి‌పి పట్టుమని నాలుగు సీట్లలో గెలవడం కష్టం. ఒంటరిగా టి‌డి‌పి ఒక్క సీటులో గెలిచిన గొప్పే. అంటే తెలంగాణలో అలాంటి పరిస్తితి ఉంది. అలా అని టి‌డి‌పికి క్యాడర్ లేదని కాదు..కొంతమేర క్యాడర్ ఉంది..పార్టీని అభిమానించే వారు ఉన్నారు.

ఇక వారితో గెలుపు అనేది కష్టమే. కానీ ఆ ఓట్లతో టి‌డి‌పి వేరే పార్టీని ఓడించవచ్చు. కొన్ని స్థానాల్లో టి‌డి‌పి ప్రభావం కనిపిస్తుంది..టి‌డి‌పి ఓట్లు చీల్చి గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. అది కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకే టి‌డి‌పి వల్ల నష్టం జరిగేలా ఉంది. ఎందుకంటే టి‌డి‌పి నుంచి మెజారిటీ లీడర్లు, క్యాడర్ బి‌ఆర్‌ఎస్ వైపుకే వెళ్లింది. కాబట్టి టి‌డి‌పి ఓట్లు చీలిస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం.

అందుకే చంద్రబాబు టి‌డి‌పి బలం మరింత పెంచేలా స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 29న నాంపల్లిలో టి‌డి‌పి ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తర్వాత తెలంగాణలో పార్టీకి మరింత ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. అంటే టి‌డి‌పికి ఎన్ని ఓట్లు పెరిగితే..అంతగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version