చట్ట సభలే సుప్రీం అని మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో పద్దుల చర్చ ముగిసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఒకే ప్రాంగణంలో రెండు సభలు నిర్వహిస్తామని.. రాజ్యాంగ పరిధిలో చట్టాలు చేసే హక్కు మనకు ఉందని పేర్కొన్నారు. కౌన్సిల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. శాసనసబ, మండలి ఒకే ప్రాంగణంలో జరగాలని కొందరూ కోరారు. గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3, గ్రూపు 4 వంటి కాంపిటేటివ్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో రిక్రూట్ మెంట్ జరుగుతుందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.
పొరపాట్లు జరిగితే దానిని సవరణలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై, అందరిపై ఉందన్నారు. చిన్న చిన్న సంఘటనలు మినహా చెప్పుకోదగిన సంఘటనలు జరుగలేదన్నారు. హైదరాబాద్ లో 2021లో 89 కేసులు, 2023లో 86 కేసులు నమోదు కాగా.. 2024 లో 83 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బ్లాక్ షీప్స్ ప్రతీ డిపార్టుమెంట్ లో ఉంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.