వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హైకోర్టు తీర్పుపై కీలక కామెంట్స్ చేసారు. హైకోర్టులో నా పౌరసత్వం పైన వెలువడిన తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీర్పు హేతుబద్ధంగా లేదన్న అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇది ప్రధానంగా 2019 లోనే తెలంగాణా హైకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10.3 ని తూచా తప్పకుండా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ను ఆదేశించిన నేపధ్యానికి వర్తిస్తుంది. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు రావచ్చు, కానీ వాటన్నిటినీ స్వయంగా, మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో తట్టుకొని ముందుకు పోవడం, ఆ ప్రస్థానంలో నీతి నిజాయితీగా పనిచేసి వరుసగా నాలుగు సార్లు ఎన్నికలలో పూర్తి ప్రజామోదం పొందడం నాకు లభించిన అరుదైన గొప్ప భాగ్యం.
కానీ వరుస ఓటములు జీర్నించుకోలేక అడ్డంకులు సృష్టించిన ఉదంతమే. నా పౌరసత్వంపై వేసిన కేసులు. వీటన్నిటినీ గతంలో రెండు సార్లు, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో, విజయవంతంగా ఎదురుకోవడం జరిగింది. ప్రస్తుత తీర్పుపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, భవిష్యత్తులో కూడా మా ప్రాంతాభివ్రుధ్ధికి నా వంతు సహకారం తప్పక ఉంటుంది అని చెన్నమనేని పేర్కొన్నారు.