రూమర్స్ ని నమ్మకండి.. జానీ మాస్టర్ కీలక పోస్ట్

-

జానీ మాస్టర్ ఇటీవల జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ ని డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి తాజాగా జానీ మాస్టర్ స్పందించాడు.
“నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అంటూ ట్వీట్ చేశాడు జానీ మాస్టర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version