కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై రేవంత్‌ సమీక్ష..ఆరోగ్య శాఖ మంత్రి లేకుండానే

-

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు.

Chief Minister Revanth Reddy reviews the construction of new Osmania Hospital with officials

ఈ సందర్భంగా పలు మార్పులు, చేర్పులను సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కాగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్‌ మినిష్టర్‌ దామోదర రాజనర్సింహ లేరని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news