Kodangal: ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. ఈ తరుణంలో మహబూబ్నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. వచ్చేనెల రెండవ తేదీన ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ఈ పోటీలో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఈ తరుణంలోనే…ఇవాళ కొడంగల్ ఎంపిడిఓ కార్యాలయంలో తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.