నేడు భద్రాచలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా భద్రాచలానికి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా భద్రాచలానికి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా రాముల వారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్ర స్వామికి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Chief Minister Revanth Reddy to visit Bhadrachalam today

స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కుటుంబంతో కలిసి తిలకించనున్నారు. అనంతరం సీఎం రేవంత్.. పట్టణంలోని సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, అధికారులు ఉండనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news