అబిడ్స్ ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో డాక్టర్స్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

-

అబిడ్స్ ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో డాక్టర్స్ నిర్లక్ష్యం తో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఆ చిన్నారి బంధువులు. మహబూబ్నగర్ టౌన్ కు చెందిన సాయికుమార్, అనుషా లకు కుమారుడు జన్మంచాడు. నాలుగు రోజులక్రితం అబిడ్స్ ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో ప్రసవం కోసం అడ్మిట్ అయిన అనుషా… మూడురోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది.

Child died due to negligence of doctors in Abids Fernandes hospital

ఆరోగ్యంగా జన్మించిన బాబు..ఈ రోజు ఉదయం చనిపోయాడు. ఈ విషయాన్ని నిర్దారించారు డాక్టర్స్. అయితే… బాబు మృతికి కారణాలు అడుగారు బంధువులు. డోస్ ఎక్కువడం వల్లనే మృతి చెందినట్లు చెబుతున్నారు బంధువులు. తమ పొరపాటు వల్ల చనిపోయాడని డాక్టర్లు ఒప్పుకునట్లు చెపుతున్నారు బంధువులు. దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు చిన్నారి బంధువులు. 3.5kg బరువుతో జన్మించి,ఆరోగ్యంగా ఉన్న బాబు ఎలా చనిపోయాడని తెలపాలని బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version