ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ సహాయం చేశారు. వరదలో కొట్టుమిట్టాడుతున్న రెండు రాష్ట్రాలకు సహాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున…. విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు రాష్ట్రాలలో వరద ప్రభావాల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఆ పరిస్థితులు తనను చాలా కలిసి వేశాయని మెగాస్టార్ ఆందోళన చెందారు. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమని… దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కూడా కోరారు.