బండి వ్యాఖ్యలపై చిరుమర్తి వివాదస్పద వ్యాఖ్యలు..అందరూ ముద్దులు పెడతారంటూ !

-

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై చిరుమర్తి లింగయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు.. బీజేపీ నేతల భార్యలకు ముద్దులు పెడతారంటూ కామెంట్‌ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.

అనంతరం బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ రాఘవరావుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణ కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించారు. బండి డౌన్ డౌన్ అంటూ సంజయ్ ఫోటోను చెప్పులతో కొట్టి, దిష్టిబొమ్మ మెడలో చెప్పుల దండ వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా లింగయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version