తెలంగాణ రాష్ట్రంలో దంచికొడుతున్నాయి వర్షాలు. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అటు చాలా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఇక నిన్న ఒక్క రోజే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 61.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇలా ఒక్క రోజే 61.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి.
కాగా, కడెం జలాశయం వద్ద వరద మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతేడాది భారీ ఎత్తున పోటెత్తిన్న వరద భయం మరోసారి కళ్లముందు కదులుతోంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి మళ్లీ ప్రమాదకరస్థాయిలో వరద వస్తోంది. సామార్థ్యాన్ని మించి చేరిన భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 3లక్షల 50 వేలు కాగా… 3లక్షల 87వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో చేరుతోంది. 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. మరో 4 గేట్లు తెరుచుకోకుండా మొరాయిస్తున్నాయి.