హైదరాబాద్ లో దంచి కొడుతోంది వాన. దింతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ ను క్యుములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. మరో గంటలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు ఏపీలోని రాయలసీమ, తిరుపతి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలియజేసింది. ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు సూచనలు జారీ చేశారు.