తెలంగాణలో ఇవాళ్టి నుంచి చీఫ్ మినిస్టర్ కప్(సీఎం కప్)-2023 పోటీలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని క్రీడాకారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో 18 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇందులో 15 క్రీడలు ఒలంపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందినవి ఉన్నాయి.
ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో.. 22 నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో.. 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి.వీటిలో విజయం సాధించిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000 శాట్స్ ప్రోత్సాహకాలను అందిచనుంది. ఈనెల29న సీఎం కప్ ఉత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనుంది. ఈ పోటీల్లో దాదాపు 4 లక్షలకు పైగా విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది.