గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

-

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితను స్మరించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.  కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని కేసీఆర్‌ అన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ.. భారత పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారని సీఎం పేర్కొన్నారు.

నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా… ఒక్కొక్కటి అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని.. గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నేటి యువత గాంధీ నడిచిన బాటలో పయనించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version