హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా -సీఎం కేసీఆర్

-

హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా అన్నారు సీఎం కేసీఆర్. ఇక్కడ అన్ని రాష్ట్రాలు,అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలోలాగా మత కల్లోలాలు,గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.

cm kcr is said that hyderabad is mini india

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ….సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం‘‘గృహలక్ష్మి” పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు.

తొలిదఫాలో రాష్ట్రంలోనిప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నాం. ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ అని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version