తెలంగాణకు రావాల్సిన వాటా కేటాయించండి : కేసీఆర్

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. అనంతరం కొల్లాపూర్ సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం కేసీఆర్. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను గత పాలకులు, నాయకులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు పాలమూరుపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా పాలమూరుకు న్యాయం జరగలేదు.

గతంలో పాలమూరు బిడ్డలు హైదరాబాద్ లో అడ్డా కూలీలుగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తిరిగి పాలమూరుకు వచ్చేశారు. పాలమూరు కే ఇతర ప్రాంతాల వారు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే పాలమూరుకు న్యాయం జరుగుతుందన్నారు. 60 ఏళ్ల నుంచి నెరవేరని పాలమూరు ప్రజల కాంక్ష నేడు నెరవేరిందని తెలిపారు. పాలమూరు పొంగు చూసి నా ఒళ్లు పులుకరిస్తుందన్నారు కేసీఆర్. ఈ ప్రాజెక్ట్ తో నా జన్మ ధన్యమైంది. కేంద్రానికి, ఆంధ్ర పాలకులకు చెబుతున్నా.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేటాయించాలని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

మరోవైపు బీజేపీ నేతలు బస్సుకు అడ్డంగా జెండాలు పట్టుకొని వస్తున్నారు. బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణా ట్రిబ్యునల్ వాటాలు తేల్చండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బీజేపీ జెండాలు పట్టుకొని వస్తే ప్రజలు నిలదీయాలని సూచించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version