ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లా పర్యటనలో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. పాలమూరు గురించి చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తున్న కేసీఆర్.. అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని మణిముత్యాల్లాంటి మాటలను చెప్పడం జరిగింది. ఈయన మాట్లాడుతూ నన్ను తెలంగాణ సాధించడానికి సపోర్ట్ ఇచ్చింది పాలమూరు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కేసీఆర్. దాదాపుగా 70 సంవత్సరాల పాటు అభివృద్ధి లేక ఏడుస్తున్న పాలమూరును ఎవ్వరూ పట్టించుకోలేదు.. పైగా చంద్రబాబు పాలనలో ఉన్న సమయంలో పాలమూరును నేను దత్తత తీసుకున్నా అని మాయమాటలు చెప్పి పునాది రాళ్లు పాతి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా వాటిని పెండింగ్ లో పెట్టి పోయిండు అంటూ కామెంట్ చేశారు..
ఈ విషయంలో వాస్తవం లేదా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సీఎం కేసీఆర్. అందుకే మా ప్రభుత్వం పాలమూరును అభివృద్ధి చేసింది.. ప్రజల ముఖాల్లో చేఇఱునవ్వును చూసింది అంటూ ప్రజలకు కనెక్ట్ అయ్యే మాటలను మాట్లాడిండు కేసీఆర్.