బ్రహ్మనందం కుమారుడి వివాహానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిసిన విషయం తెలిసిందే. ఈ సంద్భంగా తన కుమారుడు వివాహానికి హాజరు కావాల్సింది సీఎం దంపతులకు శుభలేఖ అందజేశారు బ్రహ్మానందం. అదేవిధంగా బ్రహ్మానందం స్వయంగా రెడీ చేసినటువంటి తిరుమల శ్రీవారి డ్రాయింగ్ కానుక కూడా అందించారు. బ్రహ్మానందం కుటుంబంతో సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. 

బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో జరిగింది. ఇవాళ సాయంత్రం 8 గంటలకు సిద్దార్థ్-ఐశ్వర్యల వివాహం గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్  లో జరుగనుంది. వీరి వివాహానికి హాజరు కానున్నారు  సీఎం కేసీఆర్.ఇక బ్రహ్మానందం హాస్య నటుడే కాదు.. మంచి ఆర్టిస్టు కూడా.. పెన్సిల్ డ్రాయింగ్ చేయడంలో ఆయన మేటి. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా డ్రాయింగ్స్ వేస్తుంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో డ్రాయింగ్స్ వేశారు బ్రహ్మానందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version