పత్రికలు మీ ఇష్టం వచ్చినట్లు రాస్తమంటే కుదరదంటూ హెచ్చరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేబినేట్ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుందని ఆగ్రహించారు.
కాబట్టి మంత్రి వర్గ నిర్ణయాలను, ప్రభుత్వ పరిపాలనకు సంబందించిన అంశాలను మీడియాకు తెలపడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీదర్ బాబులను అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. వీటిని సేకరించి అన్నదాతలకు రుణవిముక్తి కల్పిస్తాం. వ్యవసాయం దండగ కాదు పండగ అని భరోసా కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా, ఆగస్ట్ 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.