విద్యుత్‌ అంశంలో న్యాయవిచారణ కోరింది వాళ్లే.. వద్దంటోంది వారే : సీఎం రేవంత్

-

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్ఎస్ పార్టీ సభ్యులని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు వద్దంటోంది కూడా వాళ్లేనని పేర్కొన్నారు. జగదీశ్వర్‌రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయవిచారణ జరుగుతోంది. కేసీఆర్‌ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో జగదీశ్వర్‌రెడ్డి చెప్తున్నారు. విచారణ కమిషన్‌ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వచ్చేది. న్యాయవిచారణ కోరిందీ వాళ్లే.. వద్దంటున్నది వాళ్లే. 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగింది. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version