కేసీఆర్‌ కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నారు : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో చివరి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ ఐదేళ్లే కాకుండా వచ్చే ఐదేళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. తనను ముఖ్యమంత్రి పదవిలో చూసి బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనీసం చూడటానికి కూడా అసెంబ్లీకి వస్తలేరని అన్నారు.

కేసీఆర్ తన కుర్చీ ఇవ్వరని కేటీఆర్, హరీష్ రావులతో సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కుర్చీ మీద కన్నేశారని.. కేసీఆర్ ను ఖతం చేసి ఆయన కుర్చీ మీద కూర్చోవాలని పథకాలు రచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘కుటుంబంలో ఓ పెద్దదిక్కు ఉండాలి. పెద్దదిక్కు ఉంటేనే గౌరవం. పెద్దాయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలని స్కీములు వేయకండి. పాపం ఉండనీయండి.. తెలంగాణ కోసం కష్టపడిన పెద్దాయనను’ అంటూ కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news