మోడీని ‘పెద్దన్న’ అని పిలవడం పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..!

-

ఇటీవలే ఆదిలాబాద్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ‘బడేభాయ్’ అని సంబోధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. బడేభాయ్, చోటే భాయ్ ఒక్కటే అని విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రధానిని పెద్దన్న అని ఎందుకు పిలిచారో క్లారిటీ ఇచ్చారు.

ఫెడరల్ వ్యవస్థలో ప్రధాని అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారని తెలిపారు. అందుకే ఇటీవల స్టేట్ కు వచ్చినప్పుడు మోడీని కలిశానన్నారు. పెద్దన్న అని పిలిచా అని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం రెండు వేరు అని.. పీఎం వస్తే సీఎంగా స్వాగతం పలికాను అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏమేం కావాలో కోరినట్లు తెలిపారు. ప్రధాని అన్ని స్టేట్స్ ను సమానంగా చూడాలని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, డెవలప్మెంట్ తమకు ముఖ్యం అన్నారు. మోడీ మాత్రం పార్టీ, పరివార్, సర్కార్ ఒక్కటే అనుకుంటారని తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version