వాట్సాప్ లో మరో నయా ఫీచర్.. టెక్స్ట్‌ రూపంలోకి వాయిస్‌ మెసేజ్‌

-

ప్రముఖ మెసెంజర్ వాట్సాప్లో రోజుకో నయా ఫీచర్ వస్తోంది. ఇటీవలే స్టేటస్ స్టోరీ నిమిషం వరకు పెట్టుకునే ఫీచర్ను తీసుకువచ్చింది ఈ సంస్థ. ఇక తాజాగా మరో నయా ఫీచర్పై దృష్టి సారించింది. సాధారణంగా మనం ఎవరికైనా సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు టైప్ చేయడం కంటే వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌ బెటర్ అని అనుకుంటాం. అలాగే వాయిస్ రికార్డు చేసి మెసేజ్ పంపిస్తాం. కానీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి.

వాయిస్‌ నోట్‌ అందుకున్న అవతలి వ్యక్తి దాన్ని వినే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో వాయిస్ నోట్ను ప్లే చేసి వినలేం. దానికి పరిష్కార మార్గంగా ‘వాయిస్‌ నోట్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ సిద్ధం చేస్తున్నట్లు ‘వాబీటాఇన్ఫో’ వెల్లడించింది. దీనితో వాయిస్‌ మెసేజ్‌లను టెక్స్ట్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. దీనివల్ల నోట్‌ను వినకుండానే సందేశాన్ని చదివి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ నయా ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తేనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version