TSPSC ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

-

TSPSC ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.

CM Revanth reddy key orfers over tspsc

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సి ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీమ్ కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version