ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

-

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy launches Indira Sauragiri Jal Vikasam scheme
CM Revanth Reddy launches Indira Sauragiri Jal Vikasam scheme

 

యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. సోలార్ పంపుసెట్లతో పాటు పొలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news