టాలీవుడ్ యువ నటుడు భరత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వెంకీ, పోకిరి, రెడీ, మిస్టర్ పర్ఫెక్ట్, ఏబిసిడి, విశ్వం లాంటి అనేక సినిమాలలో నటించారు. ఇప్పుడు ఏకంగా హీరోగా కూడా భరత్ ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే ఇతను నటించిన సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉండగా…. భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన తల్లి కమలాసిని నిన్న చెన్నైలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో భరత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భరత్ తల్లి కమలహాసిని గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమలాసిని ఈరోజు కన్నుమూశారు. దీంతో భరత్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భరత్ తల్లిని చూడడానికి సినీ ప్రముఖులు అందరూ ఆయన ఇంటికి తరలివస్తున్నారు. ఈరోజు లేదా రేపు చెన్నైలో అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.