ఆదిలాబాద్ కూడా ఎయిర్ పోర్టు తెస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత నాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సూచించిన వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారని… తెలిపారు. లాల్ దర్వాజా అభివృద్ధికి నిధులు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. మీరు ఏ సమస్య చెప్పినా చేస్తానంటూ ప్రకటించారు.
నాకు క్లారిటీ చాలా ఉందని… మీరు క్లారిటీకి రండని కోరారు. మీరు సమస్య లేవనెత్తి తే నేనే పరిష్కారం చేస్తానని వెల్లడించారు. మంచి పేరు కూడా నేనే తీసుకుంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. TGPSC ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 03, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం ఈ ఘనత సాధించలేమని.. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది అని తెలిపారు.