తెలంగాణ గీత పారిశ్రామిక సహకర సంస్థలోకి నీరా కేఫ్ : గౌడ సంఘం నేతల హర్షం

-

గతంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని పలు చోట్ల నీరా కేఫ్‌ల‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గీత కార్మికులకు ఉపాధి కల్పనలో భాగంగా నీరా కేఫ్‌లను తీసుకొచ్చినట్లు అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నెక్లెస్ రో‌డ్‌లో నీరా కేఫ్ ఇంకా కొనసాగుతోంది.

అయితే, తెలంగాణ గీత పారిశ్రామిక సహకార సంస్థలో నీరా కేఫ్ చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై గౌడ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలోని నీరా కేఫ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, జూపల్లి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ చిత్రపటాలకు సదరు నేతలు పాలాభిషేకం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news