రైతులు సన్న బియ్యం వేసేలా చర్యలు – సీఎం రేవంత్ సంచలన ప్రకటన

-

కొడంగల్ లో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని ప్రకటించారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన చేస్తామని చెప్పారు.

లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని సోనియా గాంధీ తీసుకొచ్చారన్నారు.. పేదలకు ఆహారలోపం లేకుండా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.. సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ది విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఆ విషయంలో తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news