పాశమైలారం మృతులకు రూ. కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు రూ. 10 లక్షల వరకు ఖర్చులు భరించాలని అన్నారు.

ఈ క్రమంలోనే సిగాచీ యాజమాన్యం క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామని పేర్కొంది. కాగా సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 42కి మృతుల సంఖ్య చేరింది. ఇందులో మరో 42 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా 27 మంది ఆచూకీ లభించలేదు. ఇక వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్.