డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ వాట్సాప్ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ను ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేవలం మెసేజ్లను పంపించుకోవడానికి మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు మరియు ఇతర ఫీచర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ యూజర్ల కోసం ఎన్నో కొత్త ఫీచర్లను కూడా అప్డేట్ చేస్తూ వస్తుంది. వాటిలో భాగంగా ప్రస్తుతం మరొక కొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్‌ లో డాక్యుమెంట్ లను స్కాన్ చేసి పిడిఎఫ్ ఫైల్ చేసి పంపించవచ్చు. దీంతో ఎంతో సులభంగా డాక్యుమెంట్లను ఇతరులకు పంపించవచ్చు. పైగా ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం ఈ ఫీచర్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ లో యాప్ నుండి డాక్యుమెంట్లను స్కాన్ చేసి పిడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేసి ఇతరులకు పంపించవచ్చు. సహజంగా డాక్యుమెంట్ లను స్కాన్ చేయడానికి ఇతర అప్లికేషన్లు ఉపయోగించి పిడిఎఫ్ చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉంటారు. అయితే చాలా కాలంగా యూజర్లు ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ కనిపించింది అని డబ్ల్యూబీటాఇన్ఫో నివేదించడం జరిగింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ అప్డేట్‌ను కూడా అందిస్తారు అని చెప్పడం జరిగింది. కనుక వాట్సాప్‌ను ఓపెన్ చేసి నేరుగా డాక్యుమెంట్లను స్కాన్ చేయొచ్చు.

వాట్సాప్ ఓపెన్ చేసి స్కాన్ ఆప్షన్‌ పై క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ డివైస్ కెమెరా ఓపెన్ అవుతుంది. దీంతో లైవ్ రివ్యూలో చూసుకొని డాక్యుమెంట్లను సరైన పొజిషన్ లో ఉంచి స్కాన్ చేయవచ్చు. పైగా దీనిలో మాన్యువల్ మరియు ఆటో క్యాప్చర్ అనే రెండు ఆప్షన్లను కూడా ఇవ్వడం జరిగింది. మాన్యువల్ ఆప్షన్‌ లో డాక్యుమెంట్ లో ఏ భాగాన్ని స్కాన్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఆటో క్యాప్చర్‌లో స్వయంగా డాక్యుమెంట్ లు స్కాన్ అవుతాయి. దీంతో వాట్సాప్ డాక్యుమెంట్‌ ను స్కాన్ చేసి ఫోటోను ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేస్తుంది. ఈ విధంగా పిడిఎఫ్ ఫైల్‌గా మార్చుకోవచ్చు మరియు ఇతరులకు పంపించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news