డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

-

రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్గా పరిచయమున్న ధర్మపురి శ్రీనివాస్ హైదరాబాద్లో శనివారం రోజున కన్నుమూశారు. ఆయనకు నిన్న గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు డీఎస్‌ మృతదేహాన్ని హైదరాబాద్లోని నివాసంలో ఉంచారు. పార్లమెంట్‌ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న చిన్న కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వచ్చిన తర్వాత ఇందూరుకు తీసుకెళ్లారు. నగరంలోని నివాసంలో డీఎస్ పార్థీవదేహాన్ని ఉంచగా   కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, బంధువులు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా డీఎస్‌ సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్‌ నుంచి బలహీనవర్గాల వారికి అవకాశం కల్పించారని చెప్పారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.  కుటుంబసభ్యుల ఆలోచనతోనే డీఎస్‌ గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version