జూలై 14న విజయవాడ అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం

-

విజయవాడ అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పించబోతున్నట్లు విజయవాడ ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈ ఓ రామారావు ప్రకటించారు. జులై 6 నుంచీ 15వరకూ వారాహి నవరాత్రులు జరుగుతాయని…. 14న మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

Telangana Gold Bonum for Vijayawada Amma

కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని… వారాహి నవరాత్రులు వస్తున్నాయని చెప్పారు ఈ ఓ రామారావు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని పేర్కొన్నారు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు… ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆషాఢ సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version