Harish Rao : నిరుద్యోగ సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు…. బి ఆర్ ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు… మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది…కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుందని నిప్పులు చెరిగారు. ఇప్పుడు నిరుద్యోగులు గుండెలు మీద తంతున్నారు…రాహుల్ గాంధీ ని అశోక్ నగర్ పిలిపించి హామీ ఇప్పించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతాము అన్నారు… ఏపీ లో 1:100 సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. వాళ్ళేం గొంతుమ్మే కోరికలు కోరడం లేదని ఆగ్రహించారు.